విద్య :--పెందోట వెంకటేశ్వర్లు -సిద్దిపేట
నిరంతరం విద్య రా 
చూడాలి నేర్వాలి రా
 వెనకబడితే అంతేరా 
ప్రజ్ఞ తోనే ప్రతిభ రా

అమ్మనాన్న మాటలను 
గురువుగారి బోధనలను
 ఆవులాగా నెమరేస్తూ
కొత్తవి ఎన్నో చదువవలెను 

ఆన్లైన్ తరగతులు 
ఆఫ్ లైన్ తరగతులు 
యూట్యూబ్ వీడియోలు
 నిత్య మార్గదర్శకాలు