*బాగున్నాయ్!*:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలల మాటలు వెన్నముద్దలు
బాలల మాటలు గోరుముద్దలు
బాలల మాటలు రసాలగుళికలు
బాలల మాటలు పంచదారచిలకలు
!! బాగున్నాయ్!!

బాలల చేతలు గిలిగిలిగింతలు
బాలల చేతలు తీపిగురుతులు
బాలల చేతలు నవ్వులపువ్వులు
బాలల చేతలు ఆనందడోలికలు
!! బాగున్నాయ్!!

బాలల పాటలు వేదశ్రుతులు
బాలల పాటలు తేనెసోనలు
బాలల పాటలు వీనులవిందులు
బాలల పాటలు మదిపులకింతలు
!! బాగున్నాయ్!!

బాలల సన్నిధి బృందావనము
బాలల సన్నిధి నందనవనము
బాలల సన్నిధి స్వర్గపుసన్నిధి
బాలల సన్ని

ధి ఆనందాలపెన్నిధి
!! బాగున్నాయ్!!

బాలలంటే మణిపూసలే
బాలలంతా స్వాతిముత్యాలే
బాలలందరూ సుగుణాలరాశులే
బాలలేగా భావిపౌరులూ
!! బాగున్నాయ్!!