1.మట్టి!
ఆగ్రహం భారీ భూకంపం!
ఉగ్రరూపం వరద ఉధృతం!
అగ్నిహోత్రం లావాప్రవాహం!
భగ్న హృదయం బీభత్సం!
2.మట్టి !
రైతు బతుకు!
మన మెతుకు!
కార్మికుడి గని!
తరగని పని!
సైనికుడి ప్రాణం!
జీవనం పణం!
3.మట్టి!
జీవనాధారం!మహాఉదారం!
నీళ్ళు కలిపి కాళ్ళతో తొక్కు!
కుండయై చేతిలో చిక్కు!
దాహం తీర్చే పెద్ద దిక్కు!
దాని వళ్ళంతా కుళ్ళు నింపు!
చక్కని ఎరువు వేసి పంపు!
దాంతో పంట మరి పెంపు!
4.మట్టి!
అనన్య సమదృష్టి!
భూమిజనే కాదు!
భూజనులందరిని చివరికి,
దహనమైనా,ఖననమైనా!
తనలో కలుపుకుంటుంది!
5. మనిషి!
కాబట్టి మట్టంటే తెలియాలి!
అదే జీవితాన తెనిగింపు!
కాకుంటే తెలియని ముగింపు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి