మణి పూసలుసాయి భక్తి గేయం:-ఎడ్ల . లక్ష్మి

రావా రావా సాయీ
ఒక్క సారి రావోయీ
భక్తురాలి మొర వినగా
రావా ముందుకు సాయీ

కనులు తెరిసినా స్వామీ
కనులు మూసినా స్వామీ
నా మది నిండ నీ రూపు
నిండే నయ్యా స్వామీ

ఎవరిని చూసినా స్వామీ
వారిలో నీ రూపు స్వామీ 
చేతులెత్తి మొక్క నేమొ
నవ్వుకుంటారు స్వామీ

ఒక్క సారి రావయా
కోప మొద్దు నీకయా
మాపై కరుణ జూపగా
నీవు కదిలి రావయా

కనుల ముందుర నిలువయా
కనులార చూసెద నయా
హృది లోన నిలుపుకుని
మనసార కొలిచెదనయా