చిలక పలుకులు -(బాల గేయం )--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
జామపండు దొరికిందోచ్ 
జాం మని తినేస్తా... 
గ్రద్ద గాడు చూస్తాడేమో 
గబుక్కున దాంకుంటా !

తోటలో కాయలన్ని 
కోసు కొని వెళ్లారు 
అల్లరి పిల్లలొచ్చి 
కొమ్మలు విరిచారు !

పక్షులు సభచేసి 
పదే పదే తిట్టాయి 
పిందెలు కోసేది 
పిరికిపందలన్నాయి!

చెట్టు మనకు ఇస్తుంది 
చెప్పలేని లాభాలు 
ధ్వంసం చేస్తే నీకు 
దయ్యాల స్నేహాలు !

పండ్లతోటలు పెంచే 
పావన మూర్తులు 
పక్షుల పొట్ట నింపే
చక్కని మనసులు !!


కామెంట్‌లు