అవయవదానం - మొగ్గలు:--ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు.
అనుకోని ప్రమాదం జరగడం వల్లనే 
ప్రాణంనిలిపే రక్తంఅవసరo అవుతుంది!
ఆసమయంలో రక్తదానమెంతో 
పుణ్యప్రదం!

కుటుంబపెద్ద గుండె అలిసిపో
తున్నప్పుడే 
మార్పిడి శస్త్రచికిత్స అవసరo 
అవుతుంది !
జీవన్మ్రుతుల నుండి హృదయ 
దానం చిరంజీవే !

ఇంటికిదీపం ఇల్లాలికే కంటికి 
మసకైనప్పుడు 
జీవితంలో వెలుగులు నింపేది 
నేత్రదానం !
మరణానంతర నేత్రదానం మరో 
జన్మగా నిలుస్తుంది !

నవ్వులు పువ్వులైన పాపాయిలకు  
ప్రతిభగల విద్యార్థుల వ్యాధికి రక్తదానం గొప్పదే!
ఒకేజీవితంలో కొన్ని జన్మలున్న అవయవదానం!