1.నేడు బంగారం కొంటే!
ఏడాదంతా కొంటావటగా!
అది అక్షయం అవుతుందట!
నిన్ను *బతుకు క్షయం*
అనే భయం వేటాడుతోందే!
2.నేడు ఓ మంచి పని చేయి,
ఏడాదంతా అదే చేయి!
నీ బతుకు క్షయమైనా!
చేసిన మంచి అక్షయమేగా!
3.అన్నదానం! వస్త్రదానం!
రక్తదానం! విద్యాదానం!
ఏ ఒక్కటైనా,ఏడాదంతాచేస్తే,
నీ బతుకు అద్వితీయమే!
4.ప్రథమం ధర్మాచరణం!
ద్వితీయం దైవస్మరణం!
తృతీయం అనవసరమే!
*అక్షర తృతీయ!*
అనవసర ఆర్భాటమే!
5.వ్యాపారప్రపంచం!
ప్రలోభాల వ్యాపారం!
అందరూ అమ్మకాల బాట!
కొందరికే లాభాల మూట!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి