నిశ్శబ్ద యుద్ధం:-సముద్రాల శ్రీదేవి.

 జీవనంపై పై అలుముకుంటున్న
విషపు రంగుల  చిత్రాన్ని
మనసు  పటంపై  గీయకు
ధైర్యం మిశ్రమంతో కలిపిన
తెల్లని దరహాసం రంగుపులుము.
  చరిత్ర పుటలలో
ఎన్ని అవిశ్రాంత పోరాటాలో ,
ఓటమినెరుగని  బ్రతుకు సమరాలను
గుర్తు తెచ్చుకో.,
వ్యాధుల కల్లోలాలను, కాలం  సృష్టించినా
,విషమనే   వల్మీకమును చేధించి  కధనరంగానికి సిద్ధం కావాలి.
ఈనిశ్శబ్ద యుద్ధంలో ,సహనంతో పూరించిన 
సమర శంఖం  బావుటా ఎగురవేయాలి  
ఎన్ని మరకల  రణంబు అయినా, ఆత్మ విశ్వాసం  రోగనిరోధక  విల్లంబు  మాత్ర అవుతుంది. 
సామాజిక దూరం క్రింద ఎక్కుపెట్టిన   
పద్ధతుల ఆస్త్రమే 
మనుగడ కోసం పోరాటం అవుతుంది. 
కొనవూపిరి  నింపడానికి ఎన్ని అరచేతులు  రక్షణ కవచాలై. కాపు కాస్తున్నాయో, 
కనురెప్పల గాలితో అయినా
శ్వాసను నింపే  ఆపన్న హస్తాలే కదా  
ఒడ్డుకు తెచ్చే  గడ్డి పరకల ఆధారం  . 
చేతులను శుభ్రపరచడమనే కరవాలం తో
పాదం బయట మోపనివ్వని పద్మవ్యూహంనిర్మించి
 "కనిపించని సూక్ష్మజీవిని 
వధించే  అస్త్ర శస్త్రమే మన గృహ వాసం