ప్రభుత్వాలు (కైతికాలు):-తాండూరి కపిలహన్మకొండ.
అబద్ధపు వాగ్దానాలు..
చేసేటి ప్రభుత్వాలు!
ఏరు దాటి వేశాక..
తెప్ప తగలబెట్టడాలు!
వారేవా ప్రభుత్వాలు..
కూల్చుతుండె నమ్మకాలు!!

అందమైన పథకాలు
అంది అందని ఫలాలు
నిరుద్యోగ జీవితాలు
నిప్పులపై నడకలు
వారేవా ప్రభుత్వాలు!
తీర్పునా కడగండ్లు!!

మొసలి వలె కన్నీరు
కార్చేటి ప్రభుత్వాలు!
ఫోటోలకు పోజులిచ్చి
చేసేటి మాయలు!!
అయ్యయ్యో  అగవా!
ఎన్నాళ్లీ ఆగడాలు!!

దెబ్బ తగలడానికి..
ఏ రాయి అయితేనేమి?
కష్టాలు తీరునా!!
ప్రభుత్వాలు మారితేమి?
సామాన్య మానవుడికి..
సమస్యలు తప్పవుగా!

కులానికి మతానికి..
నీవు బానిసవకు!
ఓటుకై నోట్లకు..
నీవు అమ్ముడు పోకు!
ప్రభుత్వాన్ని ఎంచుకొనే
సాధనమే నీ ఓటు!!