వెండి వెలుగులు విరజిమ్మే
విద్యుత్ కాంతివి నీవు.....
చిరుగాలి పలకరింపు లో
అల్లరి చేసే బంధాల మధ్య
చిక్కని ఆత్మీయ ప్రేమ మాలవు నీవు....
మా కనుల ఎదుట తారాడుతున్న
మధుర స్వప్నానివి నీవు....
ఉషః సంధ్యలలో మాలో
ఉత్సాహాన్ని నింపే సంతోషానివి నీవు....
ఋతువులెన్ని మారినా తరగని
ఆనందాల అనుభూతివి నీవు...
నిండైన ఆయురారోగ్యాలతో
సుఖసంతోషాలతో
సిరి సంపదలతో నీవు....
ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకుంటూ....
ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ
పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ...
మా అందరి సంతోషాల మొలకవై చిరకాలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి