ఏ శిక్ష విధించాలి:- డా.. కందేపి రాణీప్రసాద్.
కరోనా పాజిటివ్ ఉందని తెలిసీ
క్వారంటైన్ లో ఉండాలని తెలిసీ
పారిపోయి రైలెక్కి బస్సులెక్కి
వందలు వేల మందిని వైరస్ కు
ఆహుతి చేసే అతి నిర్లక్ష్యపరులకు
ఏ శిక్ష విధించాలి?

ప్రస్తుత ప్రమాద పరిస్థితిలో
అత్యంత అవసరమైన
మాస్కులు, శానిటైజర్లు దాచేసి
బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ
ప్రజల ప్రాణాలతో అడుకునేవారికి
ఏ శిక్ష విధించాలి?

ప్రపంచాన్ని కాటేస్తున్న కరోనాతో
అంతా అతలాకుతలమవుతుంటే
నిజమో అబద్దమో తెల్సుకోకుండా
వాట్సప్ మెసేజ్ లను ఫార్వార్డ్ చేస్తూ
జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తే
ఏ శిక్ష విధించాలి?

ప్రమాదస్థితిని చక్కదిద్దేందుకు
లాక్ డౌన్ చేసి, కర్ఫ్యూ పెట్టి
ఇళ్ళ నుంచి బయటకు రావద్దంటే
పనిపాటలేక రోడ్ల మీదకు వచ్చే
సామజిక బాధ్యత లేని పౌరులకు
ఏ శిక్ష విధించాలి?

వైరస్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి
అష్టకష్టాలు పది వ్యాక్సిన్లు కనుక్కునే
డాక్టర్ల ప్రాణాలకు విలువలేదు
కరోనా వస్తే గొంతు మాత్రమే మంట
స్వార్థ అవినీతి పరుల పనులు చూస్తే
గుండెలు కూడా మండి ఆత్మలు క్షోభిస్తాయి!

కామెంట్‌లు