ప్రఖ్యాతసినీగేయరచయిత*. *శ్రీ వేటూరి వర్ధంతి*
సందర్భంగా గేయాంజలి
.
1. *వేటూరి*
పాటల తేనెల ఊట!
*సుందర*
మాటల వసుంధర!
*రామమూర్తి*
సినీ గేయ త్రివిక్రమస్ఫూర్తి!
2. వారి వంశవృక్షం,
సాహితీ గవాక్షం
వేటూరి ప్రభాకర శాస్త్రి బోధన,
వేటూరి వారి సాధన,
సువర్ణసుగంధ ఆరాధన,
నిత్యం పాటలదీపారాధన!
3.ఆయన ప్రతిభావంతుడైన,
ఓ పాత్రికేయుడు!
*సిరికా కొలను చిన్నది*
*కొమ్మకొమ్మకో సన్నాయి*
చక్కని గ్రంథాల లేఖకుడు!
అష్టనందులతోసహా,చతుర్దశ,
పురస్కారాల విజయుడు!
*శ్రీ శ్రీ*, తరువాతజాతీయఖ్యాతి ,
ఆర్జించిన అద్వితీయుడు!
4.నాలుగు దశాబ్దాల,
సినీగీతరచనా మహాప్రస్థానం,
దర్శకవిశ్వనాథుడు,
*ఓ సీత కథ* తో శ్రీకారం!
ఆ పైన అది నవరసప్రాకారం!
5. *శంకర నాదశరీర!*
*ఓలమ్మీ తిక్కరేగిందా!*
ఇదీ,ఆ కలానికున్న,
లక్కవంటి తిక్క!
పాటలకు పాఠాలు,
నేర్పడం వారికి లెక్కా!
6.పడతి పయ్యెద సవరించిన
రీతిగా పాట రాయగలనన్న,
ఆ పాటల మేటి *విలుకాడు!*
వేణువై భువనానికొచ్చొడు,
నాదమై గగనానికి వెళ్ళాడు!
_________________________
సరస్వతీ పుత్రులు శ్రీ వేటూరి వారికి స్మృత్యంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి