చేద బావి (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఆనాటి కాలంలో
ఇంటింట చేదబావి 
తాతలు తవ్విన బావి
గిరగిర గిరికల భావి

తాడు బొక్కె నొదిలి
గబగబా చేదవేస్తూ
బిరబిర నీళ్లు తోడేసి
కుండలు బిందలు నింపేసి

అక్క చెల్లి నేను కలిసి
ఇల్లు వాకిలి ఊడ్చేసి
పేడ నీల్లు చల్లేసి
చక్కటి ముగ్గు లేసాము

చన్నీటి స్నానం చేసి
ఉతికిన బట్టలేసుకుని
గటుక సల్లా తాగేసి 
బడికి మేము వెళ్ళేవాల్లము


కామెంట్‌లు