ఒక మేకకు ఒకే ఒక పిల్ల పుట్టింది.
దానిని గారాబంగా పెంచింది.
ఆ పిల్ల మొండిగా తయారయింది.
ఎవరి మాట వినేది కాదు.
తల్లికి కూడా ఎదురు తిరిగేది.
ఒక రోజు అమ్మ బడికి పొమ్మంది.
“నేను పోను పో" అని మొండికేసింది.
అంతే అమ్మకు కోపం వచ్చింది.
జుట్టు పట్టుకొని కొట్టింది.
ఇంకొక రోజు బడిలో మాస్టారు పాఠం చెబుతూ ప్రశ్న అడిగాడు.
తలతిక్క సమాధానం చెప్పింది.
మాస్టారు గారికి తిక్కరేగింది.
బెత్తంతో నాలుగు అంటించాడు.
ఆ రోజు నుండి ఇంక బడి మానేసింది.
ఇంటికాడ అమ్మ, బడిలో మాస్టారు తన్నులు తంతుంటే ఒక లాభం లేదని ఇంటి నుంచి పారిపోయింది.
ఊర్ల మీద పడి తిరుగుతుంది.
ఒక కసాయివాడు చూశాడు.
పట్టుకెళ్ళి కట్టేశాడు.
మాంసానికి తయారుచేశాడు.
మేక తెలుసుకుంది.
ఆ రాత్రి ఎలాగో తప్పించుకుంది.
ఇంకెప్పుడు మొండిగా ఉండకూడదూ, బుద్ధిగా చదువుకోవాలి" అని మనసులో అనుకుంది.
ఇంటిదారి పటిపట్టింది.
తల్లి మేక చాలా సంతోషించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి