బాలల కథలు రాద్దాం :-- బాలగేయం ( మణిపూసలు ):: పుట్టగుంట సురేష్ కుమార్
ఆహా . . పిట్ట కథలు
ఓహో . . యుక్తి కథలు
బాలల కథలంటే 
కమ్మని నీతి కథలు !

సాహస‌,పురాణ కథలోచ్
అద్భుత, వినోద కథలోచ్
బాలల కథలంటేనే
జానపద,హాస్య కథలోచ్ !

ఊహాశక్తి పెరగాలి
సృజనాత్మకత మెరవాలి
బాలల కథలు చదివితే
దయాగుణమే వెలగాలి !

విజ్ఞానము పెంచాలి
అజ్ఞానము తుంచాలి
బాలల కథలెప్పుడూ
సన్మార్గము చూపాలి !

సామెతలు ఉండొచ్చు
గేయాలు ఉండొచ్చు
బాలల కథలలోన
సూక్తులూ ఉండొచ్చు !

తమాషాలు చేయొచ్చు
గమ్మత్తులు చేయొచ్చు
బాలల కథల లోపల
ప్రయోగాలు చేయొచ్చు !

ఆసక్తిగ

ఉండాలోయ్
ఆలోచన పెంచాలోయ్
బాలల కథ ముగింపులో
కొసమెరుపూ ఉండాలోయ్ !

బామ్మలూ రారండోయ్
తాతలూ రారండోయ్
బాలల కథలు రాద్దాం
బాలలూ రారండోయ్ !