మొన్న సాయంత్రం మా ఆద్య జన్మదినం!
ఫిఫ్త్ భర్త్ డే- చూస్తుండగానే పిల్లలు పెద్దవారు అవుతున్నారు. మనల్ని మరింత పెద్ద వారిని చేస్తున్నారు!
కుటుంబ ఉత్సవాలను కూడా, కుటుంబ సభ్యులు అందరి మధ్య జరుపుకోలేని పరిస్థితుల ఏర్పడ్డాయి.మినీ కుటుంబ ఉత్సవం! ఈ సారి విశాఖపట్నంలో జరుపుకున్నారు- తిలక్ ,స్నేహ, మరో ఇద్దరు ఆద్య ఫ్రెండ్స్ వచ్చారట,పక్క అపార్ట్మెంట్ల వారి పిల్లలు! మొత్తం అయిదుగురు!
మొదటి జన్మదినం వాళ్ల అమ్మమ్మ అక్కడే విశాఖపట్నంలో జరిపించి , తరువాత తాను అర్ధాంతరంగా 'వెళ్లిపోయింది'
ఇప్పుడు మళ్ళీ తిరిగి అక్కడ జరుపుకుంది.
మధ్యలో రెండు జన్మదినోత్సవాలు ఇక్కడ నారపల్లెలో (గొల్లకొండలో) జరిగాయి. ఇటువంటివి పిల్లలకు సంతోషాన్ని కలిగించే విషయాలు!
పిల్లల సంతోషం,పెద్దలకూ సంతోషమే!
కుటుంబంలో జరిగే- జరుపుకునే చిన్నచిన్న సంతోష ఉత్సవాలు! దగ్గరి వారు కలుసుకోవడానికి అవి ఉపయోగపడే సందర్భాలు.ఇప్పుడు కోవిడ్ వైరస్ వల్ల ఎవరూ రారు- అలా అని ఆగకూడదు- జరుపుకోవాలి!
సంతోష సందర్భాలు కూడా, మన ఆయురారోగ్యాలకు దోహదం చేస్తాయి.
కోవిడ్ వైరస్ సెకెండ్ వేవ్ కష్టకాలంలో మా తిలక్ మాల్దీవుల నుండి తిరిగి ఇబ్బందులు పడుతూ మొన్న విశాఖపట్నం చేరుకున్నాడు.ఎల్లుండి ఇక్కడికి గొల్లకొండలోని మా నారపల్లెకు వస్తారట- వెల్కమ్!
అన్నిటికీ సిద్దపడాలి!
ఆద్యకు అయిదు సంవత్సరాలు వస్తున్నాయని, స్కూల్లో వేద్దామని ,ఏదో స్కూల్ చూసారు నిరుడు వేసవి కాలంలో-అప్పటి నుండి ఇప్పటి వరకూ, కరోనా కారణంగా స్కూల్ ముఖం చూడనే లేదు- ఈ మధ్య కొద్ది రోజుల పాటు వెళ్లడం- కరోనా సెకెండ్ వేవ్ రావడం- తిరిగి ఇంట్లో స్నేహ సమక్షంలో అక్షరాలను సాధన చెయ్యడం- స్కూల్ కు వెళ్లకుండానే అన్లైన్ చదువులు చదవడం ప్రారంభం అయిన కొత్తతరం ఇది.కొత్త అనుభవం ఇది- ప్రపంచం ఊహించని పరిణామం. ఇది ఇప్పుడిప్పుడే ముగిసే పరిణామం కాదు. ఇప్పటికే ప్రారంభం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగించుకోవాలి. గమనిస్తూ ఉంటే, భవిష్యత్తు ఆన్లైన్ టీచింగ్ వైపు ఉంది...
కరోనా వైరస్ ఏం చేసింది అంటే, మన రోగనిరోధక శక్తికి
ఓ పరీక్ష పెట్టింది! నేర్చుకునే వారికి అనేక పాఠాలు కూడా చెప్పింది. ఇటువంటి విపత్కర పరిస్థితులను ప్రపంచం ఇప్పటివరకు చాలా ఎదుర్కొంది- వాటి నుండి బ్రతికి బట్ట కట్టింది.ఇప్పుటి తరానికి ఇది కొత్త విషయం!ఇదీ నేర్చుకుంటుంది- వదిలి పెట్ట వలసిన చెడులను వదిలిపెడుతుంది.
ఎవరో అన్నారు- కరోనా వైరస్ రాక ముందు దేశవ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది ప్రతీ రోజూ మరణించేవారట!
ఇప్పుడు అంతకంటే ఎక్కువ మరణిస్తున్నారా? అప్పుటి లాంటి మరణాలు ఇప్పుడు ఏమయ్యాయి?
ప్రచార హోరులో వాస్తవ మాటలు వినపడవు!
ఒక పెద్ద గాలీ దూమారం వస్తే , కొన్ని బలహీన వృక్షాలు నేల కూలుతాయి.అది ఎప్పటికప్పుడు యధావిధిగా జరిగే పరిణామమే- కోవిడ్ కూడా అలాగే! వర్రీ కాకుండా ఉండాలి. దైర్యం ఉండాలి!
ప్రకృతి సిద్దమైన ఆహారాన్ని భుజించాలి.
నిత్యం శారీరక శ్రమ చెయ్యాలి.
సౌకర్యంగా బ్రతకడానికి కావల్సిన మేరకు సంపాదించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వద్దు- ఎక్కువ ఆరాటం తగదు! విపరీతంగా టెన్షన్ పడటం, ఉన్న ఆరోగ్యానికి ప్రమాదం!
సౌకర్యంగా బ్రతికితే చాలు- సుఖాల వైపు పరుగులు వద్దు!
మా ఆద్య ఇప్పుడు నా పాఠకురాలు కాదు- మరికొన్ని సంవత్సరాల తరువాత తప్పకుండా అవుతుంది.ప్రస్తుతం మా అబ్బాయి, అబ్బాయి తరం నాకు పాఠకులు!ఇదేమి మామూలు విషయం కాదు!
నేను నా తరువాత మూడవ తరం కోసం కూడా రాస్తాను.
నాలుగవ తరం కోసం కూడా రాస్తాను. మనం ఎప్పటికప్పుడు సమకాలీనం కావాలి.మనం మన కాన్సెస్ ను తగ్గకుండా చూసుకోవాలి. నిత్యం యాక్టివ్ గా ఉండాలి.
రచయితకు వయసు పెరగడమే ,
రాయడానికి మరింత అర్హత!
మీరు కూడా రాయడానికి ప్రయత్నాలు చెయ్యండి.
మీ మీ పేస్ బుక్ వాల్స్ ను,వ్యక్తిగత సామాజిక డైరీ ల వలె రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించండి.చివరికి అది విలువైన రికార్డు అవుతుంది.
రాయడం ఏమీ బ్రహ్మ విద్య కాదు- రాస్తే , ఓ రికార్డు ఉంటుంది! ప్రతీదీ రాయండి. మీ అనుభవాలను ఇలా వాల్స్ మీద అక్షరాలుగా కూర్చండి. ఈ కరోనా కష్టకాలంలో మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవాలి.
మిద్దెతోటల సాగు- రచనా సాగు,రెండు కూడా అందుకు ఉపయోగపడతాయి.శారీరక మానసిక ఆరోగ్యాలకు అవి అవసరం!
మా మనవరాలు జన్మదిన సందర్భంగా రాయడం ప్రారంభించి,నేను మిమ్మల్ని రాయమని చెప్పే వరకు వచ్చాను.
ఎప్పుడో ఒకప్పుడు ఇది మా మనవరాలు తప్పకుండా చదువుతుంది. అప్పుడు ఆద్య ఎలా ఫీలౌతుంది!?
జీవితానికి సంబంధించిన రచన విలువ ,కాలం గడుస్తున్నా కొద్దీ పెరుగుతుంది.
అనుభవాలను అనుభూతులను ఆలోచనలను అక్షర రూపంలో పెట్టాలి.అది అపురూపమైన రికార్డు అవుతుంది- మన కుటుంబ రికార్డు మనకు అవసరం కద?
'జీవించండి- రాయండి- అందించండి'
ఆద్యకు శుభాకాంక్షలు!
పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటే, మనమూ పిల్లలం అవుతున్నట్టు ఉంటుంది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి