నాదేశం: -కుంటముక్కల సత్యవాణి

 అందమైనది నా దేశం
సుందర భారతదేశం
వందామప్పదిఐదుకోట్ల 
జనావళితోడ 
ఒప్పుతున్నదీ ఈ దేశం
గిరులూ తరులూ నదీ నదమ్ములు
మెండుగ కలిగిన భారతదేశం
ఖనిజ సంపదలు ఘనమౌ అడవులు
అద్భుత గుహలు అమరిన దేశం
పాడిపంటలు ప్రకృతి వనరులు
దండిగ కలిగిన నా దేశం
గుడిగోపురములు, మసీదు చర్చిలు
మతఐక్యతను చాటే దేశం
పురాణ పురుషులు మునిపుంగవులు
నడయాడిన నా పవిత్ర దేశం
ఆదికావ్యాలు వేద స్మృతులు
వెల్లివిరిసిన భారతదేశం
సీతారాముల గీతాగానము
ఘనతను చాటే నా దేశం
అరవై నాలుగు కళలతో ఒప్పే
అందమైనదీ భారతదేశం
భారతమాతది ఖ్యాతిని పెంచగ
చేతులు కలుపుతు రారండీ
జాతిమతాల భేదం మరచి
భారతమాతను కొలవండి
భారతమాతను పూజిద్దాం
భావితరాలకు నేర్పిద్దాం

కామెంట్‌లు