గోదావరి అందాలు(కైతికాలు):-కల్వల రాజశేఖర్ రెడ్డి-కరీంనగర్.
గోదావరి సాగుతుంది
ఏరులా పోతుంది
పాపికొండల మధ్యన
గల గల పారుతుంది
వారెవ్వా! గోదావరి
పాపికొండల రహదారి

గోదారమ్మ పరవళ్ళు
ప్రకృతి సోయగాలు
కనుచూపుమేర
పచ్చటి పర్వత పంక్తులు
వారెవ్వా! ప్రకృతులు
అందమైన అనుభూతులు

గిలిగింతలు పెట్టే
చల్లని చలిగాలులు
కొండలలో అందమైన
సూర్యాస్తమయాలు
వారెవ్వా!దర్శనమిస్తాయి
మనసుకు ఉల్లాసాన్నిస్తాయి

రాత్రిళ్లు వెదురులు
గుడిసెల్లో బసలు
గోదారిలో స్నానాలు
పవిత్రమైన పుణ్యాలు
వారెవ్వా!పాపికొండలు
కనులవిందైన గిరులు

గోదారమ్మ ఒడిలో
జలవిహారం చేస్తూ
గిరగిరా తిరుగుతూ
ప్రకృతిని ఆస్వాదిస్తూ
వారెవ్వా! వెళుతుంటే
స్వర్గధామం కనబడుతుంది

ఎటు చూసిన అందం
మనసంతా ఆనందం
పచ్చ పచ్చని పైరులే
అనురాగ బంధం
వారెవ్వా! పాపికొండ
చల్లనైన గిరిజన కొండ

పాపికొండలు పోవాలే
అందాలన్నీ చూడాలే
ప్రకృతిని వీక్షించాలె
కలం కదిలించాలే
కవితలు రాయాలే
కవిగా గుర్తింపు పొందాలే

పాపి కొండలన్ని
ఒంపు సొంపులతో
ఒయ్యారంగా ఉంటవి
అందమైన వనితతో
వారెవ్వా!పోల్చుతూ
కవితలు రాసేస్తా

నిశ్శబ్ద వాతవరణం
శబ్దం చేసె సవ్వడులు
కోకిల రాగాలు
పిచ్చుకల కిలకిలలు
గోదావరి గలగలలు
సుందరమైన గిరులు

భోగరాముడు కొలువైన
శ్రీరామగిరి కలుపుకొని
దారికి మార్గం లేని
గిరిజన గ్రామాలని
వారెవ్వా!కలుపుకొని పోతే
మది పరవశించిపోతుంది

కొండలపై నుంచి
జారే జలపాతాలు
గుడి వెనుక నుంచి
పారే అద్భుత జలాలు
వారెవ్వా! అహ్లాదకరం
మనసుకు ఆనందకరం

నీటి పరవళ్ళతో
ఇసుక తిన్నెల తో
భద్రాద్రి రాముడి తో
భక్తి పరవశం తో
సాగుతున్నారు భక్తులు
పాపికొండల ప్రయాణానికై

పాపికొండల సోయగాలు
అందమైన అమ్మాయిలు
ఊహకందని వనితలు
మనసంతా కితకితలు
వారెవ్వా! పాపికొండలు
సుందరమైన రూపాలు

అమ్మాయి నడకల
సాగుతుంది పడవ
ఈ కొండ ప్రకృతిని
చంకలో పెట్టిన కడవ
స్త్రీ లాంటి పాపికొండ
హత్తుకున్నావు మనసునిండా

భానుడు సిగ్గుపడేలా
ఉంటుంది నీ సోయగం
స్త్రీలు ఈర్షపడేలా
కనిపించే వైభోగం
వారెవ్వా!శ్రీనాధుడే ఆదర్శం
 "స్త్రీ పాపికొండ" కవిత్వానికి


కామెంట్‌లు