వాన చినుకు:- సత్యవాణి

 రోళ్ళు బద్దలయ్యే ఎండ
రళ్ళను కరిగించే ఎండ
రక్తం మరిగించేఎండ
హఠాత్తుగా సుడిగాలిగా  ఎలా మారిపోయింది
భూమిపైన వున్న
చెత్తా చదారాలు
వడిగాలికి సుడులు తిరుగుతూ
చంద్రునిపైకి చేరాలని ప్రయత్నిస్తున్నాయి
ఉత్తరాన ఉరిమిన ఉరుములు
వానవస్తుందని తెచ్చిన సందేశం విన్న
నలనల్లని తేలి ఆడే మబ్బుల గుంపల్లే
అందీ అందని ఎత్తులో
ఆకాశంలో పల్టీలు కొడుతున్నాయి
అదిచూసి అల్లరిగా పిల్లలు
జాజిపూల జల్లులా
జారిపడే వాన చినులలో
తడుస్తూ
తడసీ తడవని నేలనుండి
మట్టి గంధపు వాసనకు
పరవశిస్తూ
పరిమళిస్తూ
 చేతులు పట్టుకు తిరుగుతూ
వానా వానా రవే
వాకిలి తడిపీ పోవే అంటూ పాడుతూ
సందడులు చేశారు
సరిపడినంతగా కురిసి
చక్కాపోయింది వాన
        
కామెంట్‌లు