క్రమశిక్షణ:- సత్యవాణి

 ప్రొద్దు ప్రొద్దున బాల నిదుర లేవాలి
అరచేత శ్రీరామ 
వ్రాసుకోవాలి
ప్రార్థించి భూమిపై
కాలు మోపాలి
పళ్ళు బాగాతోమి
పాలు తాగాలి
సబ్బురుద్దుకు స్నాన
మాచరించాలి
తలకు నూనెను రాసి
దువ్వుకోవాలి
బడికెళ్ళు బట్టలను
వేసుకోవాలి
అమ్మ పెట్టిన బువ్వ
ఆరగించాలి
ఆపైన చకచకా
బడికి పోవాలి
మాతెలుగు తల్లి అని
పాడుకోవాలి
మంచిగా పాఠాలు
నేర్చుకోవాలివి
జగడాలు రాకుండ
ఆడుకోవాలి
జనగణమన గీతి
పాడుకోవాలి
జాగ్రత్త తెలుసుకొని
ఇల్లు చేరాలి
అమ్మిచ్చు అప్పచ్చు
లారగించాలి
ఆపైన చక్కగా
చదువుకోవాలి
అవ్వ తాతల కథలు
ఆలకించాలి
అపైన కలగంటు
నిద్రపోవాలి