చందమామ చేప పిల్ల(పొడుపు గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

 నిండు పున్నమి జాబిలమ్మ
         నేలకోరుగగా
నీటి మీది అల లేమొ
      నింగికెగరగా
అలలలోని చేప లేమొ 
       ఆటలాడగా
జాబిలమ్మ వచ్చి చూసి
       జాబు రాసేను
జాబు చదివి చేపపిల్ల
        చెంత చేరగా
తెప్పలొచ్చి చేపనేమొ
       చెరువు లేసేను
చెరువు లోన చేపపిల్ల
      ఈదుచుండగా
ఈతచూసి చందమామ
      నవ్వు చుండెను
నింగి మీది జాబిలమ్మకు
   నీటిలో చేప పిల్లకు
అణుసందానమేమిటో చెప్పగలరా
అణుబంధ మెవరో విప్పగలరా

కామెంట్‌లు