బాల కృష్ణ -బాల గేయం (మణిపూసలు):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.

అమ్మ పెట్టిన వెన్న 
చాలలేదా కన్న 
కుండలే దోసేవు 
అల్లరేలా నాన్న !

అందలేదని నీవు 
ఉపాయం పన్నావు 
అన్ననే వంగించి 
నీవు పైకెక్కావు !

అంతలో వచ్చింది 
గోపికయె నవ్వింది 
అమ్మ దొంగా యంటు 
యశోదకు చెప్పింది!

మా వల్ల గాదమ్మ
దేవీ యశోదమ్మ 
మా వెన్న, పాలన్ని 
దొంగిలించేడమ్మ !

రేపల్లె నొదిలేము 
గోవులను తోలేము 
మంజులవాణి వినుము 
నీసుతుని అనబోము!

విన్నదె యశోదమ్మ
కోపమెక్కువయెమ్మ 
బాలకృష్ణని రోటికి 
తాడున కట్టెనమ్మ!

కామెంట్‌లు