పిల్లి పిల్ల ( బాల గేయం ):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
నల్ల రంగు పిల్లమ్మ
నీలి రంగు కళ్ళమ్మ
చిట్టి పొట్టి ముక్కుతో
చిన్న చిన్న మూతితో

చిన్నారి ఆ పిల్లి
వేటకై వచ్చింది
కొరకొరా చూసింది
తిక్క తిక్క చేసింది

పైపైకి ఎగిరింది
తాడు పట్టు

కుని
ఊయలుగుతూ
ఆకలే మరిచింది

నేల మీద దూకింది
ఎలుక పిల్లను పట్టింది
పొట్టనిండ మెక్కింది
తల్లి వద్దకు వెళ్ళింది