మా అమ్మ:- సత్యవాణి

 మా అమ్మ మంచి గంధపు చెక్క
అరిగింది అత్త ఆరళ్ళలో
ఆరి తేరింది అందాల చందనం బొమ్మగా
జీవిత పోరాటాలలో అణకువను
వదిలింది
ఉక్కు కవచం ధరించి ఉత్సాహంతో 
ఉరిమింది
ఉరికింది
ఉద్యమించింది
విజేత అయ్యింది
తాను గెలిచి
తన బిడ్డలను గెలిపించింది
ఇచ్చకాల మాటలు తెలియవు
అచ్చంగా ఉన్న మాటలు తప్ప
వుచ్చులు పన్నటం రానేరాదు రాదు
ఉపకారం చెయ్యడమే తప్ప
ఖరాఖండి మాటలు తప్ప
కను సైగలసలే లేవు
మనసున మాట దాచుకోవటమన్నది లేనేలేదు
తెగేసి చెప్పటమే మొహమాటం లేకుండా
దాన గుణమే తప్ప
ప్రేమించడ మే తప్ప 
ద్వేషించడంరాదు
మాట మహా జోరు 
మనసు బేజారు
మా అమ్మ భానుమతి
మహా ధీరమతి
సద్గుణవతి 
సకల సంపదల
సౌభాగ్యవతి