అమ్మ ఒడి పాపలు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ముద్దు ముద్దు పిల్లలు
ముత్యాల పేరులు
సక్కనైన పిల్లలు 
చుక్కలాంటి మెరుపులు

అమ్మ ఒడిలో పాపలు
ఆకుచాటుపిందె లు
ఇంటిలోన జ్యోతులు
ఈశ్వరుడిచ్చిన వరాలు

ఉదయ కిరణ రూపాలు
ఊయలలోని పాపలు
ఋషుల లాంటి పిల్లలు
చీకటిలోన వెలుగులు

ఎంతో మంచి పిల్లలు
ఏమి తెలియని కూనలు
మురిపాల పిల్లలు
ముద్దులొలుకు బిడ్డలు