అపర నైటింగేల్స్ ..!!:------డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ.

 స్వచ్చమైన సేవకు 
అక్షరాలాప్రతినిథులు ,
కసురుకున్నా ...
విసుక్కున్నా ....
చిరునవ్వుచిందించే 
ఆరోగ్య ప్రధాతలు !
ధవళ వస్త్రాల్లో ...
దివినుండి --
భువికి దిగివచ్చిన ,
ఆరోగ్య దూతలు ,
వైద్యుల సూచనలతో 
క్షణక్షణం కనిపెట్టుకుని ఉండే 
అపర నైటింగేల్స్ ....
మన నర్సింగ్ సిస్టర్స్ !
వారి సేవలకు వందనం ,
వారి త్యాగాలకు --
పాదాభివందనం ..!!