గెలుపు- ఓటమి:-:యడ్ల శ్రీనివాసరావుMSw,MTel విజయనగరం జిల్లా :9493707592

 భయాన్ని చూసి భయపడకు
ధైర్యం నేర్చుకుందాం
ధైర్యం సాహసి లక్ష్మీ విజయం
కనుక పోరాడు నిరంతరం
గెలుపు  - ఓటమి ల అక్షయ పాత్ర
ఎన్నుకోవడం జరిగే నిరంతర ధరిత్రి
భయపడితే భయం చంపుతుంది
ధైర్యం విడిచితే అధైర్యం వంచన చేస్తుంది
అపజయం పాలు అయితే గెలుపు వెక్కిరిస్తుంది
భయం అనేది అందుకే వదులు
ధైర్యలక్ష్మి  ఉంటే అన్నీ ఉన్నట్టే
విజయలక్ష్మి ఉంటే సంపద పెరుగును
మిత్రమా దైర్యం  లేని బ్రతుకు
సహనం లేని జీవితం
ఎడారిలో ఎండమావులు లాంటివి
ఏ దారి న విత్తనాలు వేస్తే మొలకెత్తునో
ఆ దారిన విత్తనాలు వెయ్యు
మంచి దారిలో వేస్తే మంచి ఫలితం
తెలుసుకుంటే నిత్యం గెలుపు మయం