మనిషి నడచుచుండు మనసుకు లోబడి
కష్టనష్టములను కలుగుచున్న
అహము వీడకున్న ఆపదలెన్నియో
మనసు మాయలాడి మరువబోకు!
పట్టు విడుపులేని పంతంబు నీకేల
గట్టు చేరి చేప గడుపలేదు
మందితోడి బ్రతుకు మానసికబలమ్ము
వేదనలవి తొలగి విజయమందు!
పులినిజూచి నక్క పుట్టెడు వాతలు
పోల్చుకున్న తరిని పోవునుమనమేధ
మనసులోన కొంత మర్మమెరుగు!
విశ్వమేలు వాడు వీలుగామనకిచ్చె
మార్చుకోగ మనసు మహిమజూపు
పరుల హితకరమ్ము పనియేది యైనను
మంచి వారు జేసి మన్ననందు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి