ప్రక్రియ :::: సున్నితంల-రూపకర్త:::: నెల్లుట్ల సునీత--
*******************************************************
కరోనాతో రోజులన్ని మారిపోయె
మనలో భయమేమో నిండిపోయె
ఎటు చూసినా మరణాలాయె
చూడచక్కని తెలుగు సున్నితంబు.
రోగం వస్తుందని ఒంటరులయాం
రోగం తాకిందని ఒంటరులయాం
రోగం ముదిరిందని ఒంటరిగాపోయాం
చూడచక్కని తెలుగు సున్నితంబు.
తెలవారుతుంటే భయం వేస్తుంది
ఏమి వినాలోనని భయం మిగిలింది
ఏమవుతుందోనని భయం ఆవహించింది
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
బంధాలన్ని మారిపోయె నాడు
ఒకరికొకరు దూరమాయె ఈనాడు
ఎవరికెవరు లేకుండాపోయె నేడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.
ధైర్యమే ఆయుధమయ్యె కడకు
దూరమే సాధనమయ్యె మనకు
ఆరోగ్యమే సంపదయ్యె అందరకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి