కం!
వలస జనులలో నుండిన
నెలలు మగవారు కూడా నే పనినైనన్
తలబడి చేయగనున్నా
పలు చోట్లలొపని దొరకక పస్తూలె మిగిలెన్ !
కం.
కర్మాగారము లన్నియు
నిర్మొహమాటముగా మూసె నెచ్చట గనినన్
దుర్మార్గ కరోన రుజ మ
ధర్మముగా సంచరిస్తు దాపున జేరెన్ !
కం!
చేతిలో చిల్లెర వున్నా
మూతబడిన కొట్లను గని ముప్పొద్దులలో
మూతులు మూసేయుచు తమ
చేతలడిగి వెళ్ళినారు చేవ జాలకన్ !
కం.
మూటా ముల్లెలు గైకొని
తోటి జనుల గూడి యెoత దూరమె యైనన్
పూటలు లెక్కింపక తమ
పేటలకై నడచి నడచి వెళ్ళిరి జనముల్
కం!
తిన తిండి లేకపోయిన
వెనుకాడలేదు తిరిగి వెళ్ళుట కొరకై
తన వార్ని వెంట బెట్టుక
చనినారా వలస జనులు చతికిలబడుచున్ !
కం!
త్రాగే నీరము కొరతై
సాగిరి మును ముందు వారు సాహస మొసగన్
లోగడ తా మున్నూర్లకు
వేగముగా జనిరివారు విడిచి నగరముల్ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి