:"ముచ్చటైన గాజులు"(బాలగేయం-8)చైతన్య భారతి పోతుల హైదరాబాద్--7013264464
గాజులమ్మ గాజులు
చేతినిండ గాజులు
నిండుదనం గాజులు
తొడిగి చూడు గాజులు

   ముచ్చటైన గాజులు
   మురిపించే గాజులు
   రంగురంగు గాజులు
   రమ్యమైన గాజులు

అందమైన గాజులు
అమ్మ తెచ్చే గాజులు
ముత్యాల  గాజులు
మామ తెచ్చే గాజులు

   అద్దాల గాజులు 
   మామ్మ తొడిగే గాజులు
   ప్లాస్టిక్ గాజులు
   పాప తొడిగే గాజులు

బంగారు గాజులు
బలిసినమ్మ గాజులు
లేనివారి గాజులు
తొడిగినవే గాజులు

   పెళ్ళిపడుచు గాజులు
   ఇంద్రధనస్సు గాజులు
   సీమంతం గాజులు
   చిత్రమైన గాజులు

వదినమరదలు గాజులు
ఒద్దికైన గాజులు
ఆడపడుచు గాజులు
అలరించే గాజులు

     పేరంటానికి గాజులు
    ప్రతి చోటా గాజులు
    ఆడవాళ్ళ గాజులు
    ఆహార్యం గాజులు



మనవేలే గాజులు
తొడగాలి గాజులు
మేరవాలి గాజులు
మరువకండి గాజులు

కామెంట్‌లు