వేళ్లూనుకున్న నీ స్వార్థబుద్ధికి పరాకాష్ఠ
ఏనాడో నిన్నే దహించేను ప్రళయమై..!
నువ్వు నరికిన కాండమే నీకు ఆసనమయ్యే పరోపకారానికి ప్రతిరూపమై..!
గొడ్డలి పట్టిన ఆ చేతుల్లోకి
ఆహారం తర్జుమా అవ్వక పశ్చాత్తాపమే కర్తవ్యమై..!
ఎడారైన భువిని గాంచి కన్నీళ్లే ఉబికే కనుకుండల్లో కలవరమై..!
విజ్ఞానమే అధికమై అపకారివైతివి ప్రకృతికి శత్రువై..!
ఇప్పుడు ఆలోచిస్తున్నావా?
నిండామునిగాక దారికై..
మించిపోయింది లేదులే..
పచ్చని మొక్కలు నాటుడే లక్ష్యమైతే
నీ సంకల్పం ఆక్సిజన్ సిలెండరవును!
హరితహారపు మాలను పుఢమి కంఠాన అలంకరించితే
ఆమ్లజని బుగ్గలమై వెలిగెదము!!
పోయిన స్వచ్ఛతను ఆహ్వానించితే జగతిన ప్రాణవాయువును నింపెదం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి