**ఉద్యోగ చదువుల భారతం* :-రసస్రవంతి "&" కావ్యసుధ" చరవాణి : 92473 13488 హయత్ నగర్, హైదరాబాదు


పై చదువులను చదివి
పట్టాలు చేతగొని
పని బాట కనరాక
పడిరి వీధుల వెంట
ఎందుకొచ్చిన చదువులు
లోకాన
మందగించెను బ్రతుకులు

పై చదువు లెన్నున్న
పైరవి లేకున్నా
పైకం పంచుకున్న
నౌక రన్నది సున్న
పనికై పరుగు బట్టిరి
జనులంతా
పరేషాన్ గాబట్టిరి

చదువు' కొంటున్నారు'
పదవి ' కొంటున్నారు'
వరిని కొంటున్నారు
వరుని కొంటున్నారు
జగమే బజారైయ్యెను
కలికాల
యుగ మెంతో దిగజారెను

మనగ నౌకరీ రాక
తినగ గాసం లేక
తిరిగి అలసిన యువత
తిరగబడ జోచ్చింది
పరిపాలకుల రోసిరి
కాపాడ
చుర కత్తులు దూసిరి.

"