మమతలమ్మ పదాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432
తప్పులంటే ఏవొ
ఒప్పులంటే ఏవొ
తెలిస్తేనే జీవొ
ఓ మమతలమ్మ

మౌనమే నిజమైతె
మాట దోషమ్మైతె
మూగజీవాల శృతె
ఓ మమతలమ్మ

మనసు కొకటే తెలుసు
కష్ట నష్టపు గొలుసు
అర్థమెరుగక అలుసు
ఓ మమతలమ్మ

ఎదుటి వారీవెతలు
ఎరుగ కుంటినె కథలు
తెలియవపరాధాలు
ఓ మమతలమ్మ

తెలిసింది యేమంత
తెలియంది కొండంత
పొరపాట్లకే చింత
ఓ మమతలమ్మ