మహనీయులు:-పెందోట వెంకటేశ్వర్లు-సిద్దిపేట-9440524546.

ఆదివారం పోయింది
సొమవారం వచ్చింది
సాధనలో నిలువుమంది
సద్గురులను చేరుమంది

మంగళవారం వచ్చింది
మహనీయుల కలువుమంది
బుధవారం వచ్చింది
భూమిలాగుండమంది

గురువారం వచ్చింది
గొప్పపనులు చేయమంది
శుక్రవారం వచ్చింది
శోధనలే చేయుమంది

శనివారం వచ్చింది
శ్రద్ధగ పని చేయమంది
ఆదివారం వచ్చింది
అడ్డమిక లేదంది. 

కామెంట్‌లు