*నిన్నెలా మరువగలం*!:--- కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239, శ్రీకాళహస్తి
నీకు మాటంటే ఇష్టం
నీకు పాటంటే ఇష్టం
నీకు తెలుగు భాషంటే ఇష్టం


నీ పాట వింటూ పుట్టాం
నీ మాట వింటూ పెరిగాం
నీ మరణ వార్త విని చలించిపోయాం

నీ మాటే మంత్రం
నీ పాటే వేదం

మానవలోకానికినీ పాటలు చాలని
ఆ గంధర్వులు అనుకున్నారేమో
తమ లోకానికి తీసుకొని వెళ్ళారు

వెళ్ళవయ్యా !వెళ్ళు....
ఆ లోకాన్ని కూడా ఉర్రూతలూగించు
అంతవరకు నీ పాటల పల్లకిలో
మేము ఊరేగుతుంటాం...

మరచిపోకు ..సుమా..!
మళ్ళీ మా లోకానికి వస్తావు కదూ!
వస్తావులే....ఎందుకంటే..?
మా 'తెలుగు భాషంటే' నీకు
పంచప్రాణాలు కనుక !