ఆ పలకరింపుకి
హృదయం పులకించింది.
మోడుబారిన శిశిరానికి
వసంతం వచ్చి సుమధుర
పరిమళం వెదజల్లింది
ఆ పలకరింపుకి మనసుకు
ఎంతో హాయ్ నిచ్చి
మౌనం వీడి మాట కలిపింది.
ఆ పలకరింపుకి భయం వీడి
మనోధైర్యం నిచ్చి
అడుగు ముందుకు వేయించింది
చెదిరిపోయిన అనుబంధాలు
అన్ని చిగురించి
పచ్చదనంతో పరవశించి
సుఖమయం చేసింది.
తీయటి మాట పలకరింపు
జీవితానికి కొత్త వెలుగు నిచ్చింది.
అణగారిన ఆశలకు ప్రాణం పోసి
ప్రజల కాంతితో
కొత్త దారి చూపిస్తుంది.
మాట పలకరింపు ఒక మౌనం
మాట ఒక ఆయుధం.
మనసుని గాయపరచిన
ఓదార్చే మనసుంది.
మాటతో పలకరింపు
మదినిండా అమృతం
చిలక రింపు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి