*తొలకరి చినుకు*:- *గీతారాణి అవధానుల (మయూఖ)*మంథని, పెద్దపల్లి జిల్లా--9491475210
తొలకరి చినుకు పలకరించింది
జగతిని హర్షం చిలకరించింది
పుడమి మనసు పులకరించింది..
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

ఆకాశాన మెరుపులు మెరిసాయి
తొలకరి జల్లులు కురిసాయి..
పిల్లల మనసులు మురిసాయి..
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

తొలకరి మేఘం కరుణించింది..
పొలంలో విత్తనం అంకురించింది..
రైతుల కష్టం ఫలించింది..
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

తొలకరి చినుకుకై ఎదురుచూపు..
వేసవి తాపంతో అల్లాడుతుంటే..
చల్లదనం కోసం పరితపిస్తుంటే..
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

తొలకరి వాన కురిసింది..
కవి కలం కదిలింది..
అందమైన కవనం విరిసింది..
చూడచక్కని తెలుగు సున్నితంబు..!

 *

కామెంట్‌లు