*పుత్రవాత్సల్యము-( పద్యాలు)*:-సామలేటిలింగమూర్తి-- *విశ్రాంత ఉపాద్యాయుడు* *సిద్దిపేట* *చరవాణి:9492912155*

 

          *ఆటవెలదులు*
                      ***
కొడుకుకొరకుతల్లి-కోటిమొక్కలుమొక్కు
పుత్ర ఫలముగలుగ- పొంగిపోవు 
ఊరువాడపొగడ-వుత్సాహమొందును
గొప్పగుండుప్రేమ-కొడుకుపైన
వంశవృక్షమనియు-వాంఛించుజనములు 
శ్రేష్ఠుడౌనొవాడు-దుష్టుడౌనొ
పెరిగిపెద్దనైయ్యి-పేరుకీర్తియుదె
చ్చొ
గొప్పగుండుప్రేమ -కొడుకుపైన
చదువుసంధ్యనేర్పి-చక్కగాపోషిం

తిప్పలెంతొపడియు-గొప్పజేయ
వంశకీర్తిదెచ్చి- వాసికినెక్కునో
గొప్పగుండుప్రేమ -కొడుకు పైన

కామెంట్‌లు