👌 హరి విల్లు విలసిల్లు
ఏడు రంగుల తోను
అంత రిక్షము నందు
ఓ తెలుగు బాల!
* * * * *
👌మేఘ వాహను డయిన
సుర పతికి ఆయుధము
ఇంద్ర ధనుస్సు! సుమతి!
ఓ తెలుగు బాల!
* * * * *
( ఇంద్ర ధనుస్సు నకు.. మరొక పేరు "హరి విల్లు"! "మేఘము నందు ప్రతిఫలించి; పలు విధములైన వర్ణము లతో, ధనుస్సు ఆకారముగా కనబడు సూర్య రశ్మి యే..ఇంద్ర ధనుస్సు" )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి