చిలక బాలగేయం:--మిట్టపల్లి పరశురాములు-- *సిద్దిపేట*చరవాణి:9949144820
పచ్చా పచ్చని చిలక
అంద చందాలొలుక
చిలకపలుకులతోడ
వచ్చివాలెనుమొలక

పచ్చనికొమ్మన చిలకమ్మ
పరవాలొలుకగరావమ్మ
దోరపండొకటితేవమ్మ
మాదొరబాబుకిచ్చిపోవమ్మ


తీయనిపలుకులచిలకమ్మ
చల్లనిమనసేనీదమ్మ
బుడిబుడినడకలరావమ్మ
పాపాయిజతగాపాడమ్మ
అబ్బాయిజతగాఆడమ్మ

కామెంట్‌లు