తే.గీ
వ్యాస పూర్ణిమయందున-వందనములు
గురువుగారికినిడుదును-గుండెనిండ
బ్రతుకుదెరువునుజూపియు-భద్రపచి
ప్రగతి పథమున నడిపించి-పటిమబెంచె
తే.గీ
బుద్ధిమాటలునేర్పియు-
నొద్దికగను ఆటపాటలయందున- మేటిజేసి
మంచినడతలోమనలను-మాన్యులుగను
మలచిదాపునజేర్చును-వలచిగురువు
ఆ.వె
దాచుకొనకచదువు-దానముజేయుచు
విద్యవిలువదెలిపి-విపులముగను
జ్జానసుధలుమనకు-ఘనముగానొసగిన
గొప్పవాడుగురువు-మెప్పుపొందు
ఆ.వె
అంధకారమందు-నలరారుశిష్యుల
వెలుగుపథమునడిపి-వేగిరమున
సకలవిషయాలనెల్లను-చక్కగాదెలిపిన
వందనీయుడతడు-వసుధయందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి