*ఆ.వె*
*తేనెకన్నమిన్న-తేటతెలుగుభాష*
*సాటిలేనిభాష-మేటియవని*
*మధురమైనపలుకు-మాతృభాషయెకదా*
*మరువకూడదోయి-మదిలొనెపుడు*
*ఆ.వె*
*వెన్నెలారబోసి-వెలుగుచున్నవిధము*
*వానజల్లువోలె-వసుధయందు*
*తళుకుబెళుకుతోడ-తారసిల్లుచునుండ*
*మెరియుచుండుభాష-మెరుపుతీరు*
*ఆ.వె*
*ఛందబద్దమైన-సంప్రదాయములతో* *ప్రాసయతులమైత్రి-పద్యమందు*
*భాషపలుకులెన్నొ-భావంబుకలిగించె*
*వాజ్ఞ్మయముయెంతొ-వసుధగొప్ప*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి