బాలల గేయం:-చాపలమహేందర్-9949864152

ఎండ దంచి కొట్టింది
మేఘం మబ్బు కట్టింది
వర్షం కురిసింది
పుడమి మురిసింది

పైరు మొలకెత్తింది
తరువు తరించింది
కోయిలమ్మ  వాలింది
కూని రాగాలు తీసింది

పల్లె పరవశించింది
మనసు పులకించింది


కామెంట్‌లు