వాన చినుకులు.:-తాటికోల శ్రీజ మానస,9వ తరగతి.

 ఈ ప్రపంచంలో వాన అంటే నచ్చని వారు ఎవరూ ఉండరు‌. వానలో తడవాలని, చిందులాడాలని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా ఈ కోరిక కలుగుతుంది. మనం ఎంత అలసిపోయిన వానను చూస్తూ వేడివేడిగా ఏదైనా తింటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తే మన అలసట మొత్తం మర్చిపోతాం. వానను చూసినప్పుడల్లా కాగితపు పడవ తో ఆడిన జ్ఞాపకాలు చాలా మంది నెమరువేసుకుంటారు. మనం వానను శ్రద్ధగా వింటే మనకు ఒక ప్రశాంతమైన సంగీతం వినిపిస్తుంది. వాన  తక్కువ పడితే ఎంత మధురంగా ఉంటుందో, అదే వాన ఎక్కువ పడితే ప్రజలకు అంత ఇబ్బందిని కలిగిస్తుంది. రైతు పంట పండించడానికి వాన ఎంత అవసరమో అదే పంట పోవడానికి కూడా వానే కారణమవుతుంది. కానీ వాన పడుతుంన్నప్పుడు ఒక్కసారి తలఎత్తి పైకి చూస్తే మనకు ఒక అందమైన ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఈ ఇంద్రధనస్సును తమ నిజజీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది అనుకుంటారు. ఈ మధ్యకాలంలో చెట్లు కొట్టడం వల్ల వానలు సమయానికి పడక మంచినీటికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి.కావున మన మంచి నీటిని రక్షించుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది.
కామెంట్‌లు