విద్యార్థి దశయందు వీలగును శిక్షణకు
క్రమబద్ధ జీవితము క్రమముగా విజయాలు
అటువంటి పద్ధతికి ఆద్యునిగ నిలిచారు
బేర్ గ్రిల్సు సాహసము బెదురులే కుండాను
అతిచిన్న వయసులో అద్భుతపు కార్యాలు
కొండలూ కోనల్ల కొసరుగా విహారము
రెండు వందలసార్లు రెక్కలేని పులుగై
పారాచూట్ డుముకుట పడిభుజం విరిగింది
డిస్కవరి ఛానల్ను దిశలందు వ్యాపించి
సాహసపు కృత్యాలు సాధించి చూపాడు
దీవులును శిఖరాల దివ్యానుభవములను
విశ్వముకు చాటాడు విస్మయము పంచాడు
విపత్కర స్థితిలో విచక్షణ తెలిపేటి
జీవితపు సంగతుల జేజేలు పొందాడు
జన్మదిన సమయమే జయశుభము కోరుదుము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి