నవ భారతం:-పిల్లి.హజరత్తయ్య-శింగరాయకొండ-ప్రకాశం జిల్లా
పచ్చని వృక్షమునకు పట్టిన చీడ పురుగులను
దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్న అవినీతి తిమింగలాలను తుదముట్టించి 
భరతమాత మోములో చిరనవ్వును పూయిద్ధాం..!
అవినీతి లేని నవభారతాన్ని నిర్మిద్దాం..!

స్త్రీ యనే దేవతామూర్తిని సమాజమనే ఈ నరకపు కంపు నుండి మంచి నీరుతో శుద్ధి చేసి కడిగిన ముత్యంలా బయటకు తీసి
ఆమెను దుర్గమ్మతల్లిగా పూజించి 
స్త్రీ సాధికారతకు బాటలు వేద్దాం..!

చీకటి దుప్పటి కప్పుకొని సమాజానికి
విద్యయనే కాంతిపుంజమును తోడుచేసి
చితికిన బతుకులలో వెలుగు దీపాన్ని ప్రసరింపజేసి
బడుగు జీవుల జీవితాలను ఉన్నతంగా మార్చి భరతమాత సిగలో పూలహారం తొడుగుదాం..!

కరోనా లాంటి వైరస్ లు మనుషులను 
కాటి కంపుతున్న వేళ మనోవేదనకు చెందిన మనసులకు ఓదార్పు దుప్పటి కప్పి ఆరోగ్యమనే ఔషధాన్ని అందించి ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం..!

దేశ సమగ్రతకు భంగం కలిగించడానికి
గోతికాడ గుంట నక్కలా కాచుకున్న దేశాలకు
శత్రుదుర్భేద్యమైన రక్షణవ్యవస్థను ఏర్పాటు చేసి 
శత్రువుల గుండెల్లో నిదురిద్ధాం.!
భారతీయ జెండా ఔన్నత్యాన్ని చాటుదాం..!