తండ్రి మాట జవదాటని సుపుత్రుడికి నిలువెత్తు నిదర్శనమైనవాడు శ్రీ రాముడు
క్షమాగుణం,ప్రశాంతత, సహనంలను పాటించడంలో ధృఢవిక్రముడు
మంచితనానికి,దయకు,నమ్మకానికి చిహ్నంలా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడైనాడు
సతిని ప్రాణంగా ప్రేమించి ఆమె కోసమే నిరంతరం పరితపించిన ఏక పత్నీవ్రతుడు
పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను సాధంచిన మహాప్రజ్ఞుడు
నిత్యం సత్యము పలుకుతూ సత్య వాక్య పరిపాలనను అందించిన సత్యవిక్రముడు
ఆత్మశతృవైన రావణుడుని జయించి చెడుపై ఎప్పుడూ మంచిదే విజయమని చాటిన ధర్మపాలకుడు
కుటుంబ విలువలు,స్నేహధర్మాన్ని పాటించిన సకల సంపన్నుడు
ఆలోచనాపరుడు,అహంకారం లేనివాడు, పురుషోత్తముడుగా కీర్తింపబడినాడు
ప్రజల హృదయాంతరాలలో కొలువై నిలిచిన అవతార పురుషుడు శ్రీ రాముడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి