కళ్ళెం లేని గుర్రం (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
గుర్రం ఒకటి వచ్చింది
గుగ్గిల్లు అన్నీ మెక్కింది
మాయదారి గుర్రం
అది మబ్బుల్లో తేలింది

కళ్లెం లేని ఆ గుర్రం
దుమ్ము లేపి ఎగిరింది
బల్లెం పట్టిన రాజుకు
దొరకకుండా పోయింది

సుడి గాలి వచ్చింది
గిర గిర దాన్ని తిప్పింది
నేల మీదికి విసిరింది
రాజు దాన్ని చూశాడు

మూతికి కళ్లెం వేశాడు
ఎగిరి గుర్రం ఎక్కాడు
 ఖడ్గం చేత పట్టాడు
గుర్రం పరుగులు తీసింది

యుద్ధభూమిలో ఆగింది
శత్రువు మీదికి దూకింది
రాజు యుద్ధం చేశాడు
విజయం పొంది వచ్చాడు