లాలిత్య హృదయ జాషువా :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మాట తప్పినరాజు మానవత్వపు ప్రశ్న 
ఫిరదౌసి కావ్యమై బిరుదులెన్నో తెచ్చె 

లాలిత్య హృదయుడై లక్ష్యశోధకు డయె
దళితవేదన లెల్ల దారిచూపే రచన 

జాషువా ఘనతయే జాగృతినే  కలిగించె 
వాడలను నెలకొన్న వసతిన్న కోయిలా 

జాషువా గళములో జగమంతనూగింది 
ఒక్కొక్క కావ్యమే ఒప్పుగా నమరించి 

అంటరాని పులుగే అంబమగని నడిగే 
ఏమిటీ వివక్షని ఎరుకగా చెప్పమని 

గబ్బిలము నంపాడు గట్టిగా ప్రశ్నించ
పరమశివునికి గూడ పరమదుఃఖము గలిగే 

ముంతాజు మహలుగా ముత్యమంటిది రచన 
చిత్రమయి గానమై చిన్మయపు సాధనై 

అవధాన సభలోను అవమాన మందినను 
దీపాల పిచ్చయ్య దీవెనలు తానొంది 

కావ్యముల రాణించి కర్తవ్య మునుచూపె
నవయుగ వైతాళిక నమస్సులు  జాషువా !